BREAKING
తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా రెవెన్యూ ఉద్యోగులకు టీఎన్జీవోస్ మెంబర్ షిప్ అందజేత ఖానాపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసులు పటిష్ట బందోబస్తు భూముల రిసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి వారాహి మెడికల్ స్టోర్స్ ప్రారంభం కార్యకర్తలకు అండగా ఉంటాం

ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత

Select Suryaa Now
ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
సంగారెడ్డి/జోగిపేట, (మేజర్ న్యూస్): సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఏడుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అయితే, అస్వస్థతకు గురైన విద్యార్థినులను తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన వార్డెన్, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా హాస్టల్‌లోనే ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీసింది. హాస్టల్‌లో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, తరచూ పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థినులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.