BREAKING
హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా రెవెన్యూ ఉద్యోగులకు టీఎన్జీవోస్ మెంబర్ షిప్ అందజేత ఖానాపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసులు పటిష్ట బందోబస్తు. భూముల రిసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి వారాహి మెడికల్ స్టోర్స్ ప్రారంభం కార్యకర్తలకు అండగా ఉంటాం పేదల గొంతుకగా.. ప్రజల మనిషిగా.. సర్పంచ్ బరిలో బిందునగర్ మారుతిరెడ్డి! గతంలో ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పోరాటం.. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందడుగు! ఇరాన్ సైన్యంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు! గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి *దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు* ఐవీఎఫ్‌ అండాల దందాలో కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ

భూముల రిసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

Select Suryaa Now
భూముల రిసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

దామెర, మేజర్ న్యూస్, భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్‌లో భూములు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూ విస్తీర్ణాన్ని  రీ సర్వే చేశారని, ఇంకా ఎంత మిగిలి ఉందని, ఎన్ని రోజుల్లో రీ సర్వే పూర్తి చేస్తారని, భూముల కొలతల విధానం, సాంకేతిక పరికరాల వినియోగం తదితర అంశాలను సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వేలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు.భూముల కొలతలను పక్కాగా చేపట్టాలని సూచించారు. సర్వేయర్లు భూముల రీ సర్వే అనంతరం సంబంధిత రైతులకు సాగు విస్తీర్ణం ఎంత ఉందనే వివరాలతో స్పష్టతనివ్వాలన్నారు. భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా అదనంగా మరొక రోవర్ ను కేటాయించామని, మరొక గ్రామంలో భూముల రీ సర్వే  ప్రక్రియను ప్రారంభించాలని సర్వేయర్లకు సూచించారు. కార్యక్రమంలో వెంకటాపూర్, సింగరాజుపల్లి, ల్యాదెళ్ల గ్రామాల సర్పంచులు పంచగిరి రాజు, చంద్రం, రవి యాదవ్, భూముల కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, స్థానిక తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, డీఐ సతీష్ చంద్ర, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, స్థానిక రైతులు,  తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;రాజ్ కుమార్, దామెర, హనుమకొండ జిల్లా