BREAKING
హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా రెవెన్యూ ఉద్యోగులకు టీఎన్జీవోస్ మెంబర్ షిప్ అందజేత ఖానాపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసులు పటిష్ట బందోబస్తు. భూముల రిసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి వారాహి మెడికల్ స్టోర్స్ ప్రారంభం కార్యకర్తలకు అండగా ఉంటాం పేదల గొంతుకగా.. ప్రజల మనిషిగా.. సర్పంచ్ బరిలో బిందునగర్ మారుతిరెడ్డి! గతంలో ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పోరాటం.. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందడుగు! ఇరాన్ సైన్యంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు! గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి *దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు* ఐవీఎఫ్‌ అండాల దందాలో కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసులు పటిష్ట బందోబస్తు.

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసులు పటిష్ట బందోబస్తు.

**కంబదూరు:** గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కంబదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా బారికేడ్లు, కాన్సర్టినా వైర్ కాయిల్స్, రైట్ గేర్ పరికరాలు, ఇతర భద్రతా సామగ్రిని సిద్ధం చేసి పోలీసు సిబ్బందిని పూర్తి స్థాయిలో విధులకు సమాయత్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్ల రాకపోకలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడడం, గొడవలు సృష్టించడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంయమనం పాటించాలని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కంబదూరు ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.