అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్
సూర్య ప్రతినిధి బాపట్ల ;;
బాపట్ల జిల్లా కారంచేడులో ఎన్నికల సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ భోజనం చేశారు. గురువారం జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కారంచేడులోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు ఎన్నికల విధులపై సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహం నింపారు.అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ వినోద్ ఆత్మీయతపై నేటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తుంది