andhrapradesh
ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం!
అమరావతి, (మేజర్ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. గురువారం (నవంబర్ 26) 26 జిల్లాల్లోని 201 మండలాల పరిధిలో ఉన్న 3,191 సర్పంచ్ స్థానాలు, 25,061 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 46 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు 127 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను రంగంలోకి దించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు, మద్యం పంపిణీ జరగకుండా ఉండేందుకు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.