ఖానాపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఖానాపురం, మేజర్ న్యూస్, మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఖానాపురం సహకార సంఘం చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరై ఖానాపురం మండల కేంద్రంతో పాటు మనుబోతులగడ్డ, అశోక్ నగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఆంజనేయులు, మరియు రాజు, వీరేష్ సహకార సంఘం డైరెక్టర్లు దేవినేని వేణుగోపాలరావు, లింగడి వెంకటేశ్వర్లు, బాలుగు లక్ష్మణ్, మర్రి ప్రభాకర్, బిచ్చ నాయక్, శివరాత్రి వెంకన్న, పెండ్లి రజిత, భాషబోయిన రవి యాదవ్, బండి వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టి సారంగపాణి, అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం, మనుబోతులగడ్డ సర్పంచ్ శ్రీలత-అశోక్, ఖానాపురం మాజీ సర్పంచ్ పరుచూరి సుబ్బారావు, సాగర్, రాజు, ముస్తఫ్ఫా, సాంబయ్య వివిధ గ్రామాల వార్డు సభ్యులు, మల్లి కార్జున్, పల్నాటి శ్రీను,మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ,అనిల్ కుమార్, ఖానాపూర్ వరంగల్ జిల్లా