BREAKING
ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా

పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

Select Suryaa Now
పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

 పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు పట్టణంలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు చారిత్రక విజయం సాధిస్తారని ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు.  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… ప్రచారంలో వివిధ వార్డుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు.2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేశామని చెప్పారు. సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పెంచామని, సీఆర్‌డీఏ ద్వారా రూ.15 కోట్లు, సీఎం శంకుస్థాపన చేసిన రూ.27 కోట్ల రోడ్ల పనులు చేపడుతున్నామని అన్నారు . ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5.25 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నామని అన్నారు.భర్తను కోల్పోయిన 1800 మందికి పైగా మహిళలకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని, ఎన్నికల తర్వాత అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్, ఎకో పార్క్, ట్రాఫిక్, బైపాస్, తుంగభద్ర డ్రెయిన్ పై వంతెన వంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.40 వార్డుల్లో టీడీపీ 31, జనసేన 8, బీజేపీ 1 చోట పోటీ చేస్తున్నాయని  అన్నారు చైర్‌పర్సన్ అభ్యర్థిగా కాండ్రు విజయలక్ష్మి పోటీ చేస్తున్నారని చెప్పారు. సైకిల్, గాజు, కమలం గుర్తులపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను అఖండ  మెజారిటీతో  గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- సిలార్