BREAKING
ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

సూర్య రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజంపేట గ్రామ అధ్యక్షుడు పటేల్ సాయిబాబా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఆపద సమయంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు.ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి కుటుంబానికి వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.