BREAKING
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! మంగళం సర్పంచ్ అభ్యర్థి లోకేష్ శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు

Select Suryaa Now
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -  కొత్తగా పింఛన్లు మంజూరు
సూర్య, మందమర్రి : అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో ఆర్థిక భరోసా నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిర్రకుంట గ్రామ సర్పంచ్ రాంటెంకి శ్రీలత తిరుపతి పేర్కొన్నారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచనల మేరకు చిర్రకుంట గ్రామానికి కొత్తగా మంజూరైన 28 వితంతు, దివ్యాంగుల పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను బుధవారం సర్పంచ్ శ్రీలత తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్ లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో అర్హత ఉన్నప్పటికీ అనేక మంది పింఛన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ పథకాలను చేరువ చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోందని వివరించారు. సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వారు అన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి, ఎంపీ, గ్రామ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, జనార్ధన్, శ్యామేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.