BREAKING
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! మంగళం సర్పంచ్ అభ్యర్థి లోకేష్ శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు

Select Suryaa Now
ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం..  పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు!  11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు

రేపల్లె మేజర్ న్యూస్:
పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె, బుధవారం 11వ వార్డులో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, మురుగు కాలువలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, పారిశుద్ధ్య పనులు కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ తమకు కేటాయించిన వార్డుల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రత పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల శానిటేషన్ సెక్రటరీలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు పంతాని సాయికుమార్, వార్డు కౌన్సిలర్లు గౌరీ రామకుమారి, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.