BREAKING
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! మంగళం సర్పంచ్ అభ్యర్థి లోకేష్ శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం  ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం..  మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ

రేపల్లె, మేజర్ న్యూస్:
పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టి అఖండ విజయాన్ని అందిస్తున్నారు ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ పల్లెల రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్నారు. గ్రామాల అభివృద్ధిని కేవలం ఎన్నికల హామీలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి.. గ్రామాలకు అభివృద్ధి వెలుగులు! గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలులోనూ ముందడుగు!
అభివృద్ధితో పాటు సంక్షేమానికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే మంత్రి అనగాని సత్యప్రసాద్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవడం, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం, ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం పెంపొందించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలన్న దిశగా కృషి చేస్తున్నారు.
ఎన్నికల విజయాన్ని అభివృద్ధికి పునాదిగా మార్చే వ్యూహం!
పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన బాధ్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్మకంతో అందించిన అవకాశాన్ని గ్రామాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలన్నదే కూటమి శ్రేణుల ప్రధాన లక్ష్యంగా మారింది. పల్లె బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న దృక్పథంతో మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి గ్రామంలో మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, పటిష్టమైన మౌలిక వసతులు, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దిశగా మంత్రి చొరవతో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయని కూటమి శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.