BREAKING
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! మంగళం సర్పంచ్ అభ్యర్థి లోకేష్ శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్

Select Suryaa Now
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు, భూభారతి దరఖాస్తులు, భూముల రీసర్వే, భూసేకరణ, కోర్టు కేసుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందించడంతో పాటు, పెండింగ్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ పాల్గొని జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలోని వివిధ అంశాల పురోగతిని వివరించారు.ఈ సందర్భంగా భూభారతి పథకం కింద జిల్లాలో 34 పాత కేసులు, 158 కొత్త కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలు చేసి, న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేటాయించిన 40 రోవర్లను వినియోగిస్తూ సర్వే పనులు చేపడుతున్నట్లు డీఆర్వో వివరించారు. జిల్లాలోని 14 నాన్ క్యాడస్ట్రల్ గ్రామాలకు గాను 9 గ్రామాల్లో, 17 క్యాడస్ట్రల్ గ్రామాలకు గాను 8 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.జిల్లాలో భూసేకరణ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న 93 దరఖాస్తులకు సంబంధించి 91 మంది దరఖాస్తుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు.రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సూచించారు. తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ప్రతి పెండింగ్ దరఖాస్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రెవెన్యూ అంశాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏవో ప్రవీణ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు సంధ్యారాణి, స్వాతి, సర్పరాజ్, ఈడీఎం నదీం తదితరులు పాల్గొన్నారు.