BREAKING
కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా! జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం ఆకాశంలో ఒక తార సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు.. ఏమన్నారంటే?

రజకుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
రజకుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన యాంత్రీకృత ధోబీఘాట్ సేవలను రజకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ ధోబీ కాలనీలో అంజని పుత్ర కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక యాంత్రీకృత ధోబీఘాట్‌ను కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, బహుజన వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంప్రదాయ కులవృత్తుల అభివృద్ధి, రజకుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధునిక యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా సంప్రదాయ వృత్తిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాంత్రీకృత ధోబీఘాట్ వల్ల శారీరక శ్రమ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందని, తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేసి మెరుగైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.సొసైటీ సభ్యులందరూ సమన్వయంతో, ఐకమత్యంగా ఉంటూ ధోబీఘాట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక సదుపాయాలను సద్వినియోగం చేసుకొని వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి. సోనియా, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్ షాలిని  అంజని పుత్ర కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, రజక సంఘం నాయకులు, దత్తు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.