BREAKING
తపాలా శాఖ ఆధునికీకరణకు రూ. 1,141 కోట్లు డిమాండ్ల మేరకు లేదంటూ కొత్త ఆందోళనలు సూర్య కథనానికి స్పందన - మత్తడి స్ప్రింగ్ అనకట్ట సర్వే ప్రారంభం వికసిత్ భారత్ 2047 దిశగా సంస్కరణలు, పెట్టుబడులు 'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల! ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో 'కింగ్ బుద్ధ' చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే.. 100కు పైగా భాషల్లో విడుదలకు సన్నాహాలు! భారత నాగరికత వారసత్వం, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రభావంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాసం షేర్ విమాన ప్రయాణ సేవల ద్రవ్యోల్బణం 35.52 శాతానికి జంప్ ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలి 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్' అందరి హృదయాలను హత్తుకుంటుంది: ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దీపక్! కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా! జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు

కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా!

Select Suryaa Now
కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హలో వరల్డ్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుదర్శన్ గోవింద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బీ ఏ మ్యాన్ గ్లింప్స్ తాజాగా విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. ద బాయ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పవన్ కుమార్ బైకటి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే కొంత హైప్ సృష్టించగా, తాజాగా టైటిల్‌ను ఖరారు చేస్తూ వచ్చిన గ్లింప్స్ డార్క్, ఇంటెన్స్ టోన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో సుదర్శన్ గోవింద్ సరసన ఆరుషి కథానాయికగా నటిస్తున్నారు.

సమాజంలో మగాడి భావోద్వేగాలు, ఆవేదన, అంతర్మథనాన్ని స్పృశిస్తూ ఈ గ్లింప్స్‌ను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. నీకు కోపం వస్తే ఏం చేస్తావ్, బాధేస్తే, మరి ఏడుపొస్తే, అన్నిటికీ ఇలా అరిస్తే సొసైటీ నిన్ను ఏమంటది, కోపం మగాడికి ఉండాల్సిన లక్షణం అంటూ సాగే వాయిస్‌ఓవర్ గ్లింప్స్ ప్రారంభంలోనే కథలోని తీవ్రతను గట్టిగా ఎస్టాబ్లిష్ చేస్తోంది. దానికి తగ్గట్టుగానే సుదర్శన్ పాత్రలోని ఆవేదన, ఆగ్రహం, యాక్షన్, మానసిక సంఘర్షణను ప్రతిబింబించే సన్నివేశాలు గ్లింప్స్‌కు రా, సీరియస్ ఫీల్‌ను అందించాయి.

ఈ గ్లింప్స్‌కు నేపథ్య సంగీతం, విజువల్స్ ప్రధాన బలంగా నిలిచాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. చివర్లో బీ ఏ మ్యాన్ టైటిల్‌ను వివిధ భారతీయ భాషల్లో ప్రజెంట్ చేసిన తీరు కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇంటెన్స్ గ్లింప్స్‌తో సినిమా కథాంశంపై ప్రేక్షకుల్లో కుతూహలం పెరిగింది.

ప్రతి మగాడిలో ఉండే భావోద్వేగ కోణాన్ని ఈ గ్లింప్స్ ప్రతిబింబిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గ్లింప్స్‌లో చూపించినట్టుగానే పూర్తి స్థాయి సినిమాలోనూ కథను ఆసక్తికరంగా మలిస్తే మంచి విజయం సాధిస్తుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, హీరోగా సుదర్శన్ గోవింద్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.