“శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు
గుంటూరు : పెదనంది దిపాడు మండలం లోని అబ్బీనేణిగుంట పాలెం గ్రామంలో "రబీ అపరాల పంటల సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులు' " అనే అంశం పై గుంటూరు జిల్లా, వ్యవసాయ సాంకేతక యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో, బిటిటి కన్వీనర్, సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహన రావు ఆధ్వర్యంలో రైతులకు ఆర్. పి.యల్,శిక్షనా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. మనోజ్ మాట్లాడుతూ ఈ రబీ కాలంలో రైతులు వివిధ అపరాల పంటలలో, ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకోవాలని తెలిపారు. శనగ పంటలో విత్తన శుద్ధి కి కాపెటాన్,థైరామ్, యవర్ గోల్, ట్రైకో డెర్మా వీరిడితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను పైరు 30 రోజుల వరకు రాకుండా కాపాడ వచ్చునని తెలిపారు, శనగలో ఎండు తెగులు, తుప్పు తెగులు నివారణ గురించి వివరించారు, శనగ పంటను ఈ నెల చివరి లోపు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు, శనగలలోని రకాలు గురించి, మిషన్ కటింగ్ కు అనుకూల మైన రకాలు నంద్యాల 776,47, అలాగే 1267 రకాలు గురించి వివరించారు,మిరపలో వచ్చు వైరస్ తెగుళ్లు, నల్ల తామర పురుగుల గురించి వివరించారు డా. కిషోర్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ భూములను భూసారా పరీక్ష చేయుంచుకుని, ఎరువులు వాడాలని తెలిపారు, రైతులు ప్రతి 3 సంవత్యారాలకి ఒక సారి భూసార పరీక్ష్యాలు చేయుంచుకోవాలని చెప్పారు, భాశ్వరం ఎరువులు ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలని, పైపాటుగా వేయ వద్దని తెలిపారు. ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ తోటకూర శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు కేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులు తమ భూములను పచ్చిరొట్ట, పి యమ్ డి యస్ విత్తనాలు వేసుకుని, 45 రోజుల తరువాత భూమిలో కలియ దున్నాలని తెలిపారు, రైతులు పంట అవశేషాలను తగుల బెట్టకుండా భూమిలో కలియ బెట్టి భూసారాన్ని పెంచుకోవాలని తెలిపారు, రసాయనిక ఎరువులను అధిక మొతాధులో వాడకుండా, అవసరాన్ని బట్టి వేయాలని, నానో యూరియా, నానో డిఏ ఎరువులు వాడాలని తెలిపారు గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు యన్ మోహన రావు మాట్లాడుతూ రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన గురించి, కొత్తగా వచ్చిన ఎరువులు పంపిణీ విధానం, గురించి రైతులకు వివరించారు. రైతులు కొత్తగా వచ్చిన ఎరువులు పంపిణీ గురించి అవగాహన కలిగి ఉండి, అందరూ ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారా ఫార్మర్ ఐడి ద్వారా బుకింగ్ చేసుకోవాలని, యాప్ ని ప్లేస్టోర్ లో ఇన్స్టాల్ చేసుకుని, పంటల వారీగా, విస్తీర్ణం వారీగా రైతులు క్యూ ఆర్ కోడ్ ద్వారా ఎరువులు పొందవచ్చునని తెలిపారు, అలాగే కౌలు రైతులు అందరూ సీసీఆర్ సి కార్డు తీసుకోవాలని, లేకపోతే భూ యజమానుల ఓటీపీ ద్వారా ఎరువులు పొందవచ్చునని తెలిపారు.
రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్ భీమయోజన పథకాన్ని ఈ రబీ -26 లో 5 పంటలకు, పెసర ఎకరానికి రూ.45, మినుము'ఎకరానికి రూ. 50, శనగ ఎకరానికి రూ.70, జొన్న ఎకరానికి రూ.48, మొక్కజొన్న ఎకరానికి 114 రూపాయలు కట్టి పంటల భీమా చేయుంచుకోవాలని తెలిపారు.ఈ రబీ లో పంటలకు దిగుబడుల ఆధారంగా పంటల బీమా పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. రైతులందరూ డిసెంబర్ 15 వ తారీకు లోగా పైన పేర్కొన్న 5 పంటలకు ప్రీమియం చెల్లించి పంటల భీమాలో చేరాలని తెలిపారు. రైతులందరకి ఫ్రేమ్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ యాప్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ చేయుంచుకోవాలని తెలిపారు ఈ కారుక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కసాయాల గురించి వివరించారు, ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది విఏఏ లు, అధిక సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు..