BREAKING
తపాలా శాఖ ఆధునికీకరణకు రూ. 1,141 కోట్లు డిమాండ్ల మేరకు లేదంటూ కొత్త ఆందోళనలు సూర్య కథనానికి స్పందన - మత్తడి స్ప్రింగ్ అనకట్ట సర్వే ప్రారంభం వికసిత్ భారత్ 2047 దిశగా సంస్కరణలు, పెట్టుబడులు 'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల! ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో 'కింగ్ బుద్ధ' చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే.. 100కు పైగా భాషల్లో విడుదలకు సన్నాహాలు! భారత నాగరికత వారసత్వం, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రభావంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాసం షేర్ విమాన ప్రయాణ సేవల ద్రవ్యోల్బణం 35.52 శాతానికి జంప్ ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలి 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్' అందరి హృదయాలను హత్తుకుంటుంది: ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దీపక్! కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా! జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

సూర్య బెజ్జుర్: 7వ నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్‌ లో బెజ్జుర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ జ్యోతి భా. పూలే విద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆసిఫాబాద్‌లో నవంబర్ 22న నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో విద్యాలయ విద్యార్థులు పాల్గొని మొత్తం 21 పతకాలు సాధించారు. విద్యార్థులు 08 బంగారు, 07 వెండి, 06 కాంస్య పతకాలు కైవసం చేసుకుని విద్యాలయానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్  వసంత్ విద్యార్థులను అభినందించి, వారి కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యాలయ ఉపాధ్యాయ బృందం అభినందనలు పేర్కొన్నారు.