BREAKING
'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్' అందరి హృదయాలను హత్తుకుంటుంది: ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దీపక్! కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా! జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం

అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి -  కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లాలోని ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పీవీటీజీ కోర్ ప్రాంతాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని, రిజర్వ్ ఫారెస్ట్ (ఆర్‌ఎఫ్‌) పరిధిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద గిరిజన లబ్ధిదారులకు గృహ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూముల్లో లబ్ధిదారుల ఆధ్వర్యంలో చేపడుతున్న పాత చేదబావుల పూడికతీత, కొత్త చేదబావుల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఏజెన్సీ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న అటవీ శాఖ అనుమతుల సమస్యలపై అధికారులతో చర్చించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, హౌసింగ్, విద్యుత్ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న క్లియరెన్స్‌లను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పెండింగ్ అనుమతులను త్వరితగతిన పొందాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బొబాడే, హౌసింగ్ పీడీ శంకర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.