BREAKING
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం ఆకాశంలో ఒక తార సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు.. ఏమన్నారంటే? ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా

సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష

Select Suryaa Now
సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష
సూర్య, మందమర్రి: డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మందమర్రి ఏరియా అధికారులు సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలు, సంస్థకు సంబంధించిన కీలక డేటా రక్షణలో ఉద్యోగుల బాధ్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ఉద్యోగులు, సిబ్బందికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎం హెచ్‌ఆర్డీ (కార్పొరేట్) ఆదేశాల మేరకు ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, ఏరియా జీటీసీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఏజీఎం (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. సదస్సులో ఐటీ డీవై మేనేజర్ కె. రవి సాంకేతిక ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతులను వివరించారు. నకిలీ ఈ-మెయిల్స్, మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లు, అనుమానాస్పద ఫోన్ కాల్స్, హానికరమైన యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ఎలా దొంగిలిస్తున్నారో తెలియజేశారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రస్తుతం కాల్ ఫార్వార్డింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, ఏఐ సాంకేతికతతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు సైబర్ నేరాలకు కొత్త మార్గాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని, తెలియని లింకులను తెరవడం, అనధికార యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్య అతిథి ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం ప్రస్తుత కాలంలో అత్యవసరమన్నారు. ఉద్యోగులు తమ విధుల్లో భాగంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ డిజిటల్ భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. సదస్సులో పొందిన అవగాహనను కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో పంచుకుని సైబర్ నేరాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, జీటీసీ జేటీవో దేవులపల్లి శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ కె. సుమన్, జీఎం కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.