BREAKING
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ తొలి గేమ్ డ్రా.. సిందరోవ్ ఒత్తిడిని దీటుగా ఎదుర్కొన్న గుకేశ్! మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాపై భారత్ ఘన విజయం.. దీపిక హ్యాట్రిక్ మెరుపులు! హైదరాబాద్‌లో 'ఆట' డ్యాన్స్ షో ఆడిషన్స్.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలనుకునేవారికి చక్కటి అవకాశం! ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా కొత్తపల్లి హేమలత ఇంటింట ప్రచారం తపాలా శాఖ ఆధునికీకరణకు రూ. 1,141 కోట్లు డిమాండ్ల మేరకు లేదంటూ కొత్త ఆందోళనలు సూర్య కథనానికి స్పందన - మత్తడి స్ప్రింగ్ అనకట్ట సర్వే ప్రారంభం వికసిత్ భారత్ 2047 దిశగా సంస్కరణలు, పెట్టుబడులు 'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల! ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో 'కింగ్ బుద్ధ' చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే.. 100కు పైగా భాషల్లో విడుదలకు సన్నాహాలు! భారత నాగరికత వారసత్వం, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రభావంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాసం షేర్ విమాన ప్రయాణ సేవల ద్రవ్యోల్బణం 35.52 శాతానికి జంప్

'కింగ్ బుద్ధ' చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే.. 100కు పైగా భాషల్లో విడుదలకు సన్నాహాలు!

Select Suryaa Now
'కింగ్ బుద్ధ' చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మల్లికార్జున ఖర్గే.. 100కు పైగా భాషల్లో విడుదలకు సన్నాహాలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు దర్శకుడు సత్యారెడ్డి రూపొందిస్తున్న అంతర్జాతీయ చిత్రం కింగ్ బుద్ధ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ప్రముఖ బౌద్ధ భిక్షువుల సమక్షంలో ఈ చిత్ర భారతీయ భాషల పోస్టర్లను ఆవిష్కరించారు. రెండేళ్ల క్రితం అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పలు బౌద్ధ దేశాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఒక భారతీయుడు, అందులోనూ తెలుగు దర్శకుడు హాలీవుడ్ స్థాయిలో గౌతమ బుద్ధుని చరిత్రను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇప్పటివరకు పూర్తయిన కింగ్ బుద్ధ చిత్ర సన్నివేశాలను స్వయంగా వీక్షించిన ఖర్గే, కథా నిర్మాణం, పాత్రల రూపకల్పనపై చిత్ర బృందానికి పలు విలువైన సూచనలు అందించారు.

దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ బౌద్ధ ధర్మంపై ఎంతో అవగాహన ఉన్న మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా తమ చిత్ర పోస్టర్లు ఆవిష్కరించబడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కర్ణాటకతో పాటు గుల్బర్గా ప్రాంతంలో బౌద్ధ ధర్మ వ్యాప్తికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఖర్గే అందించిన సూచనలను తప్పకుండా పాటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా, థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, వియత్నం, లావోస్ సహా అనేక బౌద్ధ దేశాల్లో షూటింగ్ పూర్తి చేశామని వెల్లడించారు.

వచ్చే ఏడాది బుద్ధ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా భాషల్లో, అనేక దేశాల్లో కింగ్ బుద్ధ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఆసియా ఖండంలోని ఒక దేశ ప్రధాని చేతుల మీదుగా, వివిధ దేశాల బౌద్ధ భిక్షువుల సమక్షంలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే గౌతమ బుద్ధుని పాత్రలో నటించడం తన అదృష్టమని, ఆ పాత్ర కోసం పన్నెండు కిలోల బరువు తగ్గినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్, పవన్ రామ్‌తో పాటు పలువురు బౌద్ధ భిక్షువులు పాల్గొని చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.