BREAKING
చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఐఓఏ అధ్యక్ష రేసు నుంచి పీటీ ఉష తప్పుకున్నారు.. డిసెంబర్ 5న ఎన్నికలు! ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ తొలి గేమ్ డ్రా.. సిందరోవ్ ఒత్తిడిని దీటుగా ఎదుర్కొన్న గుకేశ్! మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాపై భారత్ ఘన విజయం.. దీపిక హ్యాట్రిక్ మెరుపులు! హైదరాబాద్‌లో 'ఆట' డ్యాన్స్ షో ఆడిషన్స్.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలనుకునేవారికి చక్కటి అవకాశం! ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా కొత్తపల్లి హేమలత ఇంటింట ప్రచారం తపాలా శాఖ ఆధునికీకరణకు రూ. 1,141 కోట్లు డిమాండ్ల మేరకు లేదంటూ కొత్త ఆందోళనలు సూర్య కథనానికి స్పందన - మత్తడి స్ప్రింగ్ అనకట్ట సర్వే ప్రారంభం వికసిత్ భారత్ 2047 దిశగా సంస్కరణలు, పెట్టుబడులు 'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల! ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో

'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల!

Select Suryaa Now
'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సుగి విజయ్, జుప్సీ భద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఐ హేట్ మ్యారేజ్ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వంలో, ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ సి కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల మాట్లాడుతూ ట్రైలర్ చూసి చాలామంది ఇది బోల్డ్ సినిమా అనుకుంటున్నారని, కానీ ఇది నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రతిబింబించే మెచ్యూర్డ్ మరియు హార్ట్ టచ్చింగ్ ప్రేమకథ అని స్పష్టం చేశారు. నేటి యువతీయువకులు ప్రేమించుకుని కలిసి తిరుగుతున్నప్పటికీ పెళ్లి విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు చూసిన సంబంధాల వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారనే అంశాన్ని ఈ చిత్రంలో సహజంగా చర్చించామని తెలిపారు. జెన్ జీ తరానికి దగ్గరగా ఉండే ఈ కథను చూసిన ప్రతి ఒక్కరికీ తమకు తెలిసిన వారి జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుందని చెప్పారు.

నిర్మాత మాదం దయానంద్ మాట్లాడుతూ విజయ్ సి కుమార్ వంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ తమ ప్రాజెక్ట్‌లోకి రావడంతో సినిమాపై నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా నేటి యువత ఆలోచనలు, కెరీర్, పెళ్లి పట్ల వారి అభిప్రాయాలను వాస్తవికంగా ఆవిష్కరించామని పేర్కొన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ప్రయాణం చుట్టూ సాగే ఈ కథలో డేరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, విడుదల తర్వాత సమాజంలో దీనిపై తప్పకుండా చర్చ జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి, ఎడిటర్ ఆవుల వెంకటేష్ మాట్లాడుతూ దర్శకుడు పరమేష్ ఎంతో తపనతో ఈ చిత్రాన్ని రూపొందించారని, స్నేహితుల ప్రోత్సాహంతో దర్శకుడిగా పరిచయమవుతున్న ఆయనకు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ జుప్సీ భద్ర మాట్లాడుతూ కథ విన్నప్పుడే ఎంతో బలంగా అనిపించిందని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు.