కొత్తపల్లి హేమలత ఇంటింట ప్రచారం
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా మూడో వార్డు సభ్యురాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి హేమలత బుధవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తన భర్త కొత్తపల్లి సత్యనారాయణతో పాటు బీజేపీ తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కనికనిడి జీవిత, పెద్దిరెడ్డి దుర్గాభవాని, కొత్తపల్లి రితిక, కనికనిడి ప్రసాద్ తదితర జనసైనికులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా డిసెంబర్ 2వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు సభ్యురాలిగా తనకు ఓటు వేసి గెలిపించాలని కొత్తపల్లి హేమలత ఓటర్లను అభ్యర్థించారు.