BREAKING
పద్మశాలి ఎమ్మెల్సీ సిరిసిల్ల మహిళకు ఇవ్వాలి - టీపీసీసీ అధ్యక్షుడికి కాముని వనిత హెచ్‌పీవీ టీకా లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి - డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అర్హుల ఓటు హక్కుకు భంగం వద్దు - పరిశీలకులు బాలమయాదేవి పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం ప్యాకేజ్డ్ తాగునీటి నాణ్యతపై దేశవ్యాప్త తనిఖీలు ప్రారంభించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం తీర్పు గుంటూరు పోస్టల్ డివిజన్కు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం.. అవార్డుల పంట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా! ఏటవాకిలి సర్పంచ్ అభ్యర్థి సోమనాథ్ రెడ్డి! సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* దక్షిణ అస్సాంలోని డోలూలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి రూ. 2,014 కోట్లు చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఇ.వి.ఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ భూముల రీ సర్వే ద్వారా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

నవంబర్ 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల్లో పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు

Select Suryaa Now
నవంబర్ 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల్లో పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు

గుంటూరు : జిల్లాలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసీ), పొన్నూరు మున్సిపాలిటీలలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో ఎన్నికల నిర్వహణ చేయాలని సూచించారు.ఎంటిఎంసీలో 62 వార్డులు, పొన్నూరు మున్సిపాలిటీలో 40 వార్డులు కలిపి మొత్తం 102 వార్డులకు ఎన్నికలు నిర్వహించ నున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంటిఎంసీలో 261, పొన్నూరులో 84 కలిపి మొత్తం 345 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఈ రెండు పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి మొత్తం 2,97,913 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎంటిఎంసీలో 2,37,713 మంది, పొన్నూరులో 60,200 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లతో కలిపి సుమారు 2,201 మంది సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. వారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. నవంబర్ 26వ తేదీన పోలింగ్, నవంబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంటిఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశామని, పొన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి జీబీసీ రోడ్డులోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేశామని పేర్కొన్నారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతం గా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం చేసిందని కలెక్టర్ తెలిపారు. ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల ఎన్నికల్లో ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.సూర్య నాయక్