BREAKING
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి : శ్రీరాముల కొండయ్య విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్ ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన

అర్హుల ఓటు హక్కుకు భంగం వద్దు - పరిశీలకులు బాలమయాదేవి

Select Suryaa Now
అర్హుల ఓటు హక్కుకు భంగం వద్దు - పరిశీలకులు బాలమయాదేవి
సూర్య రాజన్న సిరిసిల్ల : అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోవద్దని,ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు,బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి అధికారులను ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ గరిమ అగ్రవాల్,అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆమె ఈఆర్ఓలు,ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమన్నారు. దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో,అర్హులైన ఒక్కరూ హక్కు కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యమన్నా రు.జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను అభినందించారు.ధ్రువపత్రాల పరిశీలన గడువులోగా పూర్తిచేయాలని, తొలగించిన ఓట్లకు కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదుచేసి,పత్రాలను భద్రపరచాలని సూచించారు.ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసేలా అవగాహన కల్పించాలని,ఏఎస్‌డీడీ జాబితాను మరోసారి పరిశీలించాలని ఆదేశించారు.జనవరి 1 నుంచి నవంబర్ 25 వరకు ఫారం-6,7,8 కింద 88,638 దరఖాస్తులు రాగా 87,853 పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు.ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రక్రియను గడువులోగా పూర్తిచేస్తామని కలెక్టర్ చెప్పారు.అనంతరం పరిశీలకులు,కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌ పోలింగ్ కేంద్రం 1105ను సందర్శించి రికార్డులు, ఆన్‌లైన్ నమోదు,హెల్ప్‌డెస్క్,ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల,వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి,కలెక్టరేట్ పర్యవేక్షకులు ఉమారాణి,ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.