BREAKING
9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం ప్రజలు నమ్మకమే నా బాధ్యత మండలాభివృద్ధికి కృషి: వెన్నె 2036 ఒలింపిక్స్ కలతో క్రీడల్లో మహిళలకు కొత్త రెక్కలు అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాసం పంచుకున్న ప్రధాని మోదీ కరువు సహాయంలో కౌలు రైతులకు అన్యాయం

ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ

Select Suryaa Now
ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఈరోజు బుధవారం వయవృద్ధుల జిల్లా సమైక్య మరియు హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వేడుకలను ఘనంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించినారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ కె మిల్కా జిల్లా సంక్షేమ అధికారి, అతిథులుగా ఏం .మనోహర్ రావు కార్య నిర్వాహక సంచాలకులు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం డెవలప్మెంట్ కార్పొరేషన్ ,చీఫ్ లీగల్ సెల్  డిఫెన్స్ కౌన్సిల్ అథారిటీ డి.గంగారం ,ఉమేష్ రావు దోలే,  సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సురేందర్, దిశా కమిటీ మహిళ సభ్యురాలు  నివేదితవ,పాల్గొనగా మయోవృద్ధుల జిల్లా సమైక్య సభ్యులు పెద్ద సంఖ్యలో వృద్ధులు హాజరైనారు. ముఖ్యంగా ,వయోవృద్ధులు సైబర్ క్రైమ్ మోసాల బారిన  పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ,స్మార్ట్ ఫోన్ వాడకంలో వృద్ధులు అనుకోకుండా తప్పుడు లింకులు నొక్కేసి భారీ ఎత్తున పొదుపు చేసిన డబ్బులను పోగొట్టు కుంటున్నారు కావున తీసుకోవలసిన జాగ్రత్తలు సైబర్ క్రైమ్ సీఐ సురేందర్ అవగాహన కల్పించారు . చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్లు డి .గంగారం మరియు ఉమేష్ రావు దోలే 2007 తల్లిదండ్రుల పోషణ చట్టాలను తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యతల గురించి వృద్ధులకు అవగాహన చేసినారు .ముఖ్య అతిథి డాక్టర్ మిల్కా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ వృద్ధులందరూ ప్రాణం మల్టీపర్పస్ డే కే సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుంటూ కాలక్షేపం చేయాలని కోరినారు. వయోవృద్ధుల జిల్లా సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో సభ్యులు అందరూ కలిసి తెలంగాణ జిల్లాలో అన్నిట్లో ఆదిలాబాద్ జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చినందుకు అభినందనలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షిష సీనియర్ సిటిజన్స్ కు అన్ని సదుపాయాలు అందజేస్తున్నారు. సమాజంలో వృద్ధులను గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం అని కొనియాడారు. మనోహర్ రావు రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ సీనియర్ సిటిజన్స్ యొక్క సహకారాన్ని ,అభిప్రాయాలని తీసుకుంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కాన్ఫరేషన్ అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్పాండే హెరిటేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కే ప్రభాకర్ రెడ్డి సీనియర్ సభ్యులు  డాక్టర్ సుధాకర్ ,పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  లక్ష్మారెడ్డి ,వృద్ధాశ్రమాల నిర్వాహకులు సురేందర్ ,అశోక్ పాల్గొన్నారు.