BREAKING
గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు* జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్ ఘనంగా భక్త కనకదాసు 539వ జయంతి వేడుకలు : హాజరైన సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు : విచ్చేసిన జెడ్పిటిసి జబ్బల మీనా,కౌన్సిలర్లు పార్వతి,మల్లికా మద్యం మత్తులో డ్రైవింగ్.. ఐదుగురికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష*నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. అశ్వారావుపేట ఎస్హెచ్ఓ హెచ్చరిక*

అనుమతి లేకుండానే తాగునీటి వినియోగం.. అక్రమ కనెక్షన్ తొలగించిన జలమండలి

Select Suryaa Now
అనుమతి లేకుండానే తాగునీటి వినియోగం.. అక్రమ కనెక్షన్ తొలగించిన జలమండలి

హైదరాబాద్  మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):జలమండలి మల్కాజిగిరి జోన్ నంబర్-2, బోయిన్‌పల్లి సర్కిల్ పరిధిలోని మణికంఠ ఎలిగెన్స్ అపార్ట్‌మెంట్‌కు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న తాగునీటి కనెక్షన్‌ను జలమండలి అధికారులు తొలగించారు.
డీసీడబ్ల్యూ (DCW) పనుల పరిశీలనలో భాగంగా జలమండలి అధికారులు తనిఖీలు చేపట్టగా.. జలమండలి అధికారికంగా కనెక్షన్ మంజూరు చేయకముందే 50 ఎంఎం డయా కలిగిన నీటి కనెక్షన్‌ను అక్రమంగా ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు.
సదరు వినియోగదారుడు నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, డిపాజిట్‌తో పాటు ఇంప్రూవ్‌మెంట్ ఛార్జీలు చెల్లించినప్పటికీ.. జలమండలి అధికారికంగా కనెక్షన్ విడుదల చేయకముందే, కస్టమర్ అకౌంట్ నంబర్ (CAN) కేటాయించకుండానే నీటిని వినియోగించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో అక్రమ నీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు సంబంధిత వినియోగదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జలమండలి అనుమతి లేకుండా అక్రమంగా నీటి కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.