telangana
రాజ్యాంగ పరిరక్షణకు యువత ముందుకు రావాలి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ పిలుపు
హైదరాబాద్,మేజర్ న్యూస్ ప్రతినిధి : భారత రాజ్యాంగ పరిరక్షణకు యువత సంఘటితమై ముందుకు రావాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖరరెడ్డి భవన్‌లో ‘భారత రాజ్యాంగం – యువత భవిష్యత్తు – ప్రజాస్వామ్య పరిరక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతన్నారు. ఏఐవైఎఫ్ జాతీయ నాయకులు కల్లూరు ధర్మేంద్ర, టి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, నిరుద్యోగం, విద్యా సమస్యలు, సామాజిక వివక్షను రాజ్యాంగ స్ఫూర్తితో పరిష్కరించాలని కోరారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.