BREAKING
గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు* జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్ ఘనంగా భక్త కనకదాసు 539వ జయంతి వేడుకలు : హాజరైన సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు : విచ్చేసిన జెడ్పిటిసి జబ్బల మీనా,కౌన్సిలర్లు పార్వతి,మల్లికా మద్యం మత్తులో డ్రైవింగ్.. ఐదుగురికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష*నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. అశ్వారావుపేట ఎస్హెచ్ఓ హెచ్చరిక*

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు

Select Suryaa Now
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు

అనంతపురం విద్య మేజర్ న్యూస్:- భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు పేర్కొన్నారు. గురువారం జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు, రిజిస్ట్రార్ ఆచార్య బి. దుర్గా ప్రసాద్, వీసీ ఓఎస్డీ ఆచార్య ఎన్. దేవన్న రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, 1949 నవంబర్ 26న ఆమోదం పొందగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉద్యోగులందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ఆచార్య వైశాలి గోర్పడే, ఆచార్య పి.ఆర్. భానుమూర్తి, ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, ఆచార్య ఆర్. భవానీ, ఆచార్య సి. శోభాబిందు, ఆచార్య పద్మ సువర్ణ, ఆచార్య ఎస్. వసుంధర, ఆచార్య ఏ.పి. శివకుమార్, ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి, డాక్టర్ జి. మమత, పీఆర్వో బి. ఓం ప్రకాష్ తదితర అధ్యాపకులు, బోధనేతర, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..