ప్రజలు నమ్మకమే నా బాధ్యత మండలాభివృద్ధికి కృషి: వెన్నె
గుర్ల, నవంబర్ 26, మేజర్ న్యూస్:
మండల ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గుర్ల మండలభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నూతన ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు తెలిపారు. గురువారం ఆయన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తూ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే కలా వెంకట్రావు ఆదేశాలు అనుసారం నడుచుకుంటూ తన అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు, పార్టీలకతీతంగా ప్రజలకు సేవలందిస్తూ, సుపరిపాలన అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని, అలాగే పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమలరాజు కిరణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు చనమల్ల మహేష్, సంచా న సన్యాసినాయుడు, డాక్టర్ సుంకరి రమణమూర్తి, దాసరి శివప్రసాద్, గెలుపొందిన 8మంది ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొని నూతన ఎంపీపీని దుశ్శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.