BREAKING
9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం ప్రజలు నమ్మకమే నా బాధ్యత మండలాభివృద్ధికి కృషి: వెన్నె 2036 ఒలింపిక్స్ కలతో క్రీడల్లో మహిళలకు కొత్త రెక్కలు అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాసం పంచుకున్న ప్రధాని మోదీ కరువు సహాయంలో కౌలు రైతులకు అన్యాయం

ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య

Select Suryaa Now
ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య
సూర్య, జన్నారం : కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని కోర్ ఏరియా పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ ఆంక్షలు తగ్గించి మండలంలోని పలు గ్రామాలకు ఇసుకను సరఫరా చేసేటట్లు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జన్నారం మండలం అభివృద్ధి కమిటీ కన్వీనర్ శ్రీరాముల కొండయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ అధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్ లు కోరారు. బుధవారం జన్నారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమీపంలో గల గోదావరిలో నుంచి ఇండ్ల నిర్మాణాలకు, గ్రామాల అభివృద్ధికి ఇసుకను తెచ్చుకుంటే అటవీ అధికారులు పట్టుకొని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక దొరకక రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారని, కొన్ని ఇందిరమ్మ ఇండ్లు పనులు నిలిచిపోయాయని అన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అటవీ అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని తగ్గించి ఇసుక తెచ్చుకోవడానికి అనుమతులు ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోడూరి చంద్రయ్య, శ్రీరాముల గంగాధర్, ఆడెపు లక్ష్మీనారాయణ, కనికరపు అశోక్, కూకటికారి బుచ్చన్న, బైరి తిరుపతి, ముల్కల ప్రభాకర్, దుర్గం అమృతరావు తదితరులు పాల్గొన్నారు.