BREAKING
9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం ప్రజలు నమ్మకమే నా బాధ్యత మండలాభివృద్ధికి కృషి: వెన్నె 2036 ఒలింపిక్స్ కలతో క్రీడల్లో మహిళలకు కొత్త రెక్కలు అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాసం పంచుకున్న ప్రధాని మోదీ కరువు సహాయంలో కౌలు రైతులకు అన్యాయం

పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్

Select Suryaa Now
పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్

గుంటూరు : పన్నుల చెల్లింపుల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడంతో పాటు పౌరులకు వేగవంతమైన సేవలను అందించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు పన్నులు చెల్లించేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా ఎక్కడి నుండైనా సులభంగా చెల్లించే వెసులుబాటు అందుబాటులో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన శాఖ అధికారిక వెబ్‌సైట్ https://cdma.ap.gov.in/ ద్వారా ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ చెల్లింపుల విధానం వల్ల సెలవు దినాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నిమిషాల వ్యవధిలో చెల్లింపులు పూర్తి చేయవచ్చని, ప్రతి చెల్లింపుకు తక్షణమే ఆన్‌లైన్ రసీదు లభిస్తుందని వివరించారు. దీని వల్ల సేవల్లో వేగం పెరగడమే కాకుండా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత సాధ్యమవుతుందని అన్నారు. నగర అభివృద్ధిలో పన్నుల చెల్లింపు అత్యంత కీలకమని, బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ సకాలంలో తమ పన్నులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించి నగర ప్రగతికి సహకరించాలని కోరారు.

 

సూర్య నాయక్