telangana
వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు
సూర్య రాజన్న సిరిసిల్ల : శాంతినగర్ 14వ వార్డులో వ్యవసాయ భూమిలో అనుమతి లేకుండా భవనం, రేకుల షెడ్లు వేసి డయింగ్ యూనిట్లు నడుపుతూ,మున్సిపల్‌కు పన్ను చెల్లించకుండా వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. గాజుల బాలయ్య కౌన్సిలర్‌గా ఉన్నప్పుడే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టి 20 ఏళ్లుగా పన్ను ఎగ్గొడుతూ మున్సిపల్ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయి పన్నును జరిమానాతో కలిపి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం, నాయకులు కొండ శ్యామ్,గుజ్జే దేవదాస్, బొల్లబత్తిని ఎల్లయ్య పాల్గొన్నారు.