telangana
ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి రూ.1.82 లక్షల సాయo
సూర్య రాజన్న సిరిసిల్ల : 17వ(ఐఆర్)పోలీస్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతిచెందిన ఏఆర్‌ఎస్‌ఐ జాటోత్ గోపి కుటుంబానికి బెటాలియన్ సిబ్బంది రూ.1,82,000 ఆర్థిక సాయం అందించారు.గోపి 2013 బ్యాచ్‌కు చెందిన సహచర కానిస్టేబుళ్లు,బెటాలియన్ సిబ్బంది సేకరించిన మొత్తాన్ని కమాండెంట్ పి.జె.పి.సి.ఛటర్జీ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.గోపి కుటుంబానికి బెటాలియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైనా ముందుండి సహకరిస్తామని కమాండెంట్ హామీ ఇచ్చారు.ఆపదలో తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన సిబ్బంది ఐక్యత అభినందనీయమని పేర్కొన్నారు.