BREAKING
ఈసీబీ వడ్డీ రేట్ల పెంపునకు అక్టోబర్ సమావేశంలోనే భారీ మద్దతు 9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం ప్రజలు నమ్మకమే నా బాధ్యత మండలాభివృద్ధికి కృషి: వెన్నె 2036 ఒలింపిక్స్ కలతో క్రీడల్లో మహిళలకు కొత్త రెక్కలు అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాసం పంచుకున్న ప్రధాని మోదీ

విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం

Select Suryaa Now
విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం

గుంటూరు: భవిష్యత్‌ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్త సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనాలని ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీ. సందీప్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (అటానమస్‌)లో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వారి వాణి (వైబ్రంట్‌ అడ్వకసీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ అండ్‌ నర్చరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌) పథకం సహకారంతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. ‘‘సుస్థిరత, స్వచ్ఛ ఇంధనం మరియు వాతావరణ మార్పుల కోసం సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాలు’’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీ. సందీప్‌ మాట్లాడుతూ... సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీలు) ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్, ఇంధన కొరత, పర్యావరణ కాలుష్యం వంటి సవాళ్లను అధిగమించడంలో ఇంజినీరింగ్‌ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సౌరశక్తి, పవనశక్తి, గ్రీన్‌ హైడ్రోజన్, విద్యుత్‌ వాహనాలు వంటి స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ హితమైన భవిష్యత్తును నిర్మించవచ్చని వివరించారు.

అలాగే, ఆధునిక ఇంజినీరింగ్‌ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వనరుల సమర్థ వినియోగం, ఇంధన సామర్థ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ వంటి అంశాల్లో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధకులు, విద్యార్థులు కేవలం సాంకేతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. ఇంజినీరింగ్‌ పరిష్కారాలు స్థానిక అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచవ్యాప్త సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మొత్తం 62 మంది పాల్గొంటుండగా, ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యావేత్తలు, పారిశ్రామిక రంగానికి చెందిన నిపుణులు వనరుల వ్యక్తులుగా పాల్గొని తమ పరిశోధన అనుభవాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పారిశ్రామిక అనువర్తనాలను వివరిస్తున్నారు. అనంతరం ముఖ్య అతిథిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ డా. కె. ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్