BREAKING
9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం ప్రజలు నమ్మకమే నా బాధ్యత మండలాభివృద్ధికి కృషి: వెన్నె 2036 ఒలింపిక్స్ కలతో క్రీడల్లో మహిళలకు కొత్త రెక్కలు అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాసం పంచుకున్న ప్రధాని మోదీ కరువు సహాయంలో కౌలు రైతులకు అన్యాయం

ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి

Select Suryaa Now
ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి
సూర్య,రాయికల్: రాయికల్ పట్టణంలోని 12వ వార్డులో ఉన్న ముస్లిం కబరస్తాన్ ప్రహరీ గోడను ఆనుకొని ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న పిల్లర్‌ను వెంటనే తొలగించాలని రాయికల్ ముస్లిం కమిటీ సభ్యులు కోరారు.ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముస్లిం కబరస్తాన్‌కు సంబంధించిన స్థలం వద్ద తమ కమిటీ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా,అనుమతి తీసుకోకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం పిల్లర్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.సంబంధిత స్థలానికి సంబంధించిన కమిటీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు.కావున అధికారులు వెంటనే స్పందించి నిర్మిస్తున్న పిల్లర్‌ను తొలగించి,భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.