telangana
ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం
సూర్య రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతం పై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామి వారి రథోత్సవం బుధవారం శోభాయమానంగా జరిగింది. ఆధ్యాత్మిక చింతన, భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథోత్సవ వేడుకలు మార్మోగాయి. అందంగా అలంకరించిన రథంపై ఉంచిన స్వామి వారి ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు గ్రామ పురవీధుల గుండా కొనసాగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథానికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అంబేద్కర్ చౌరస్తా, ఇందిరాచౌక్ మీదుగా తిరిగి స్వామి వారి రధం కోవెళకు చేరింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, తహసిల్దార్ పుష్పలత, ఎస్ఐ మోతీరాం, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, వార్డు సభ్యులు పూదరి మహిపాల్, పొన్నూరి శ్రీనివాస్, నాయకులు పుట్కపు మహేష్, దయ్యాల శ్రీనివాస్, గసికంటి రాజు, ఆకుల వెంకటి, ఈర్ణం నవీన్, రావణవేణి సందీప్ లతో పాటు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.