గుంటూరు పోస్టల్ డివిజన్కు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం.. అవార్డుల పంట
గుంటూరు : తపాలా ఉద్యోగుల సమిష్టి కృషి, అంకితభావం, నిరంతర ప్రయత్నాల ఫలితంగా గుంటూరు పోస్టల్ డివిజన్ రాష్ట్రస్థాయిలో ఘనత సాధించింది. అర్ధ సంవత్సరానికి సంబంధించిన మెయిల్స్ ఆపరేషన్స్ విభాగంలో గుంటూరు డివిజన్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే, తపాలా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పంచరత్న పోటీలలో అకౌంట్ ఓపెనింగ్ విభాగంలోనూ డివిజన్ బహుమతిని దక్కించుకుంది. నవంబర్ 19, 20 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి డివిజనల్ హెడ్స్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ శ్రీమతి బి.పి. శ్రీదేవి చేతుల మీదుగా గుంటూరు డివిజనల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ శ్రీ డబ్ల్యూ. నాగాదిత్య కుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీ నాగాదిత్య కుమార్ మాట్లాడుతూ, డివిజన్ సిబ్బంది అందరి అంకితభావం, సమిష్టి కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
సూర్య నాయక్