BREAKING
ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన సూర్యనారాయణుడికి వెండి కిరీటం బహుకరణ బాల్య వివాహాలు బాలికల విద్యకు దూరం ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి రూ.1.82 లక్షల సాయo విదేశీ నిధుల రాక, ముడి చమురు తగ్గుదలతో సెన్సెక్స్ 1,502 పాయింట్లు జంప్ మహిళా సాధికారతే వికసిత భారత్‌కు బాట: డిసెంబర్ 23 వరకు విస్తృత కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు పద్మశాలి ఎమ్మెల్సీ సిరిసిల్ల మహిళకు ఇవ్వాలి - టీపీసీసీ అధ్యక్షుడికి కాముని వనిత హెచ్‌పీవీ టీకా లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి - డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అర్హుల ఓటు హక్కుకు భంగం వద్దు - పరిశీలకులు బాలమయాదేవి

చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

Select Suryaa Now
చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

చాగలమర్రి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్:  
చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైకాపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముల్లా రేష్మ భర్త చక్రం షబ్బీర్ అహ్మద్ , వార్డు మెంబర్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చాగలమర్రి గ్రామం ప్రశాంతంగా ఉండాలని తాము ఘర్షణలను గొడవలను కోరుకోవడం లేదన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలని మా కోరిక అన్నారు. అందుకే అందరమూ కలిసికట్టుగా నిర్ణయించుకొని చాగలమర్రి ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో తాము గురువారం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికలు మంచి వాతావరణంలో జరుగుతాయన్న నమ్మకం తమకు కనపడడం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో గొడవలు జరగడం తమకు ఇష్టం లేదన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చాగలమర్రి వైకాపా నాయకులు షేక్ బాబూలాల్, కుమార్ రెడ్డి, వార్డు మెంబర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా