BREAKING
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి : శ్రీరాముల కొండయ్య విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్ ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన

హెచ్‌పీవీ టీకా లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి - డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్

Select Suryaa Now
హెచ్‌పీవీ టీకా లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి - డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్
సూర్య రాజన్న సిరిసిల్ల : హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు.సిరిసిల్ల పట్టణంలోని పీఎస్‌నగర్ యూపీహెచ్‌సీని బుధవారం ఆమె సందర్శించి వైద్యసేవలు,రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదుచేయాలని సిబ్బందికి సూచించారు. హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతపై తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పించి,అపోహలు తొలగించాలని,అర్హులైన బాలికలందరికీ టీకా అందేలా చూడాలని చెప్పారు. అనంతరం అమృత చిల్డ్రన్ హాస్పిటల్‌ను సందర్శించి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2010 ప్రకారం వైద్యసేవలు, రికార్డులను పరిశీలించారు.నిబంధనలు తప్పక పాటిస్తూ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని,రోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సాహితి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.