లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు
సూర్య,రాయికల్: రాయికల్ పట్టణంలోని పరిహార క్షేత్రం అయ్యప్ప స్వామి టెంపుల్‌లో అయ్యప్ప స్వాములకు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 36 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించగా,ముగ్గురికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందనీ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ మోసారపు సంతోష్ మధుమేహం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఆహారపు అలవాట్లు,ప్రతిరోజూ వ్యాయామం,నడక యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్,ట్రెజరర్ సుధావేణి మురళి గౌడ్,కౌన్సిలర్ రాకేష్ నాయక్,లయన్స్ క్లబ్ సభ్యులు సామల సత్యనారాయణ,సంకోజి అశోక్,ఆడెపు రాంప్రసాద్,సాంబార్ శ్రీనివాస్,బాలే నిఖిల్,పోస్ట్ గంగాధర్,జక్కుల చంద్రశేఖర్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.