telangana
పద్మశాలి ఎమ్మెల్సీ సిరిసిల్ల మహిళకు ఇవ్వాలి - టీపీసీసీ అధ్యక్షుడికి కాముని వనిత
సూర్య రాజన్న సిరిసిల్ల : పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తామన్న ఎమ్మెల్సీ అవకాశాన్ని సిరిసిల్లకు చెందిన పద్మశాలి మహిళకు కల్పించాలని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం రోజున ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన వనిత,ఇటీవల సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను గుర్తుచేశారు. ఆ అవకాశం తనకు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.2015 నుంచి సిరిసిల్ల పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా,2022 నుంచి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్లు,2017 నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు వివరించారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా తన అభ్యర్థిత్వాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు.విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తానని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.