BREAKING
దక్షిణ అస్సాంలోని డోలూలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి రూ. 2,014 కోట్లు చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఇ.వి.ఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ భూముల రీ సర్వే ద్వారా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* నవంబర్ 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల్లో పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు బీజేవైఎం గణపురం మండల అధ్యక్షునిగా గద్దల హేమంత్ తమిళనాడు కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్‌కు రూ. 4,288 కోట్లు చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఐఓఏ అధ్యక్ష రేసు నుంచి పీటీ ఉష తప్పుకున్నారు.. డిసెంబర్ 5న ఎన్నికలు! ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ తొలి గేమ్ డ్రా.. సిందరోవ్ ఒత్తిడిని దీటుగా ఎదుర్కొన్న గుకేశ్! మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాపై భారత్ ఘన విజయం.. దీపిక హ్యాట్రిక్ మెరుపులు! హైదరాబాద్‌లో 'ఆట' డ్యాన్స్ షో ఆడిషన్స్.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలనుకునేవారికి చక్కటి అవకాశం! ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా

చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

Select Suryaa Now
చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

చాగలమర్రి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైకాపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చాగలమర్రి గ్రామం ప్రశాంతంగా ఉండాలని తాము ఘర్షణలను గొడవలను కోరుకోవడం లేదన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలని మా కోరిక అన్నారు. అందుకే అందరమూ కలిసికట్టుగా నిర్ణయించుకొని చాగలమర్రి ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో తాము గురువారం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికలు మంచి వాతావరణంలో జరుగుతాయన్న నమ్మకం తమకు కనపడడం లేదన్నారు. ఎన్నికలుగా సందర్భంగా గ్రామంలో గొడవలు జరగడం తమకు ఇష్టం లేదన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చాగలమర్రి వైకాపా నాయకులు షేక్ బాబూలాల్, సర్పంచ్ అభ్యర్థి భర్త ముళ్ళ షబ్బీర్ (చక్రం బీడీ నిర్వాహకులు), కుమార్ రెడ్డి, వార్డు మెంబర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా