బీజేవైఎం గణపురం మండల అధ్యక్షునిగా గద్దల హేమంత్
గణపురం, మేజర్ న్యూస్, గణపురం మండల భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మండల అధ్యక్షునిగా చేల్పూర్ గ్రామానికి చెందిన గద్దల హేమంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ గణపురం మండల పార్టీ నాయకులు హేమంత్‌ను ఘనంగా సన్మానించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గద్దల హేమంత్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి, రాష్ట్ర నాయకులు జన్ను మొగిలి, ఎరుకల గణపతి, వెన్నంపల్లి పాపయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉడత నాగరాజు, బీజేపీ గణపురం మండల కన్వీనర్ మంద మహేష్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, మండల ఇన్‌చార్జి శివనాత్రి వేణు, జిల్లా కార్యదర్శి జిట్టబోయిన సాంబయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాదాస్ మొగిలి గౌడ్‌తో పాటు మండల నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గణపురం మండల యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని, యువతకు అండగా నిలుస్తూ బీజేపీ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని హేమంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ గణపురం మండల కన్వీనర్ మంద మహేష్, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి భాషావేణి నరేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మామిడిశెట్టి సాంబశివుడు, బొద్దుల మొగిలి, నాయకపు నరసింహ, రాములు గౌడ్, చిలుమల్ల ప్రవీణ్, జన్ను ప్రశాంత్, ఎన్నిండ్ల సమ్మయ్య, దుప్పటి శివ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; ఎల్లయ్య, గణపురం ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా