BREAKING
చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఐఓఏ అధ్యక్ష రేసు నుంచి పీటీ ఉష తప్పుకున్నారు.. డిసెంబర్ 5న ఎన్నికలు! ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ తొలి గేమ్ డ్రా.. సిందరోవ్ ఒత్తిడిని దీటుగా ఎదుర్కొన్న గుకేశ్! మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాపై భారత్ ఘన విజయం.. దీపిక హ్యాట్రిక్ మెరుపులు! హైదరాబాద్‌లో 'ఆట' డ్యాన్స్ షో ఆడిషన్స్.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలనుకునేవారికి చక్కటి అవకాశం! ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా కొత్తపల్లి హేమలత ఇంటింట ప్రచారం తపాలా శాఖ ఆధునికీకరణకు రూ. 1,141 కోట్లు డిమాండ్ల మేరకు లేదంటూ కొత్త ఆందోళనలు సూర్య కథనానికి స్పందన - మత్తడి స్ప్రింగ్ అనకట్ట సర్వే ప్రారంభం వికసిత్ భారత్ 2047 దిశగా సంస్కరణలు, పెట్టుబడులు 'ఐ హేట్ మ్యారేజ్' బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల! ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో

ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు

Select Suryaa Now
ఈనెల 27న సంకటహర చతుర్థి వేడుకలు

కాజీపేట , మేజర్ న్యూస్, కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను చాటుతూ కాజీపేట జూబ్లీ మార్కెట్‌లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శివపార్వతుల కల్యాణ మహోత్సవం, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు గణపతి హోమం, 6 గంటలకు గణపతికి పంచామృత అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం, రాత్రి 8 గంటలకు సహస్ర దీపాలంకరణ, హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేయనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలను పురస్కరించుకొని దేవాలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించడంతో పాటు శివపార్వతుల కల్యాణ మహోత్సవం, సహస్ర దీపాలంకరణ, మహా అన్నప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. దేవాలయ పూల అలంకరణ, శివపార్వతుల కల్యాణం, సహస్ర దీపాలంకరణ, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు భక్తులు తమ వంతు ఆర్థిక, వస్తురూప సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు, మహిళలు, యువకులు, ఆధ్యాత్మిక అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ పవిత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ పూజారి కోరారు.

రిపోర్టర్ ;గిరి ప్రసాద్ ,కాజీపేట, హనుమకొండ జిల్లా