BREAKING
భూముల రీ సర్వే ద్వారా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* నవంబర్ 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల్లో పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు బీజేవైఎం గణపురం మండల అధ్యక్షునిగా గద్దల హేమంత్ తమిళనాడు కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్‌కు రూ. 4,288 కోట్లు చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం చాగలమరి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఐఓఏ అధ్యక్ష రేసు నుంచి పీటీ ఉష తప్పుకున్నారు.. డిసెంబర్ 5న ఎన్నికలు! ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ తొలి గేమ్ డ్రా.. సిందరోవ్ ఒత్తిడిని దీటుగా ఎదుర్కొన్న గుకేశ్! మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాపై భారత్ ఘన విజయం.. దీపిక హ్యాట్రిక్ మెరుపులు! హైదరాబాద్‌లో 'ఆట' డ్యాన్స్ షో ఆడిషన్స్.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలనుకునేవారికి చక్కటి అవకాశం! ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా కొత్తపల్లి హేమలత ఇంటింట ప్రచారం తపాలా శాఖ ఆధునికీకరణకు రూ. 1,141 కోట్లు డిమాండ్ల మేరకు లేదంటూ కొత్త ఆందోళనలు

ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా

Select Suryaa Now
ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో సిగ్న పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా

కాజీపేట , మేజర్ న్యూస్, కరీంనగర్‌లో ఛాంపియన్స్ కరాటే-డో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో సిగ్నా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయాన్ని సాధించారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ జాతీయస్థాయి పోటీల్లో సిగ్నా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో పాటు ట్రోఫీలను సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. హనుమకొండ జిల్లాకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు బి.యం.ఆర్ కరాటే-డో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. వీరిలో సిగ్నా పబ్లిక్ స్కూల్‌కు చెందిన 15 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీపడి పతకాలు, ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. క్రీడల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, నిరంతర సాధనతో విద్యార్థులు ఈ విజయాన్ని సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజేతలు, జట్టు సభ్యులను బి.యం.ఆర్. కరాటే-డో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు బండారి సంతోష్, కోచ్ ఏ. గణేష్ తేజ అభినందించారు. అలాగే సిగ్నా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ ఎస్. జఫీల్ రెడ్డి, సిగ్నా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సీహెచ్. మధుకర్ రెడ్డి విద్యార్థుల విజయాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థుల ప్రతిభ పట్ల పాఠశాల యాజమాన్యం, అకాడమీ నిర్వాహకులు గర్వం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో సాధన చేస్తే క్రీడారంగంలో మరిన్ని విజయాలు సాధించవచ్చని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్ ; గిరి ప్రసాద్ , కాజీపేట, హనుమకొండ జిల్లా