BREAKING
పద్మశాలి ఎమ్మెల్సీ సిరిసిల్ల మహిళకు ఇవ్వాలి - టీపీసీసీ అధ్యక్షుడికి కాముని వనిత హెచ్‌పీవీ టీకా లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి - డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అర్హుల ఓటు హక్కుకు భంగం వద్దు - పరిశీలకులు బాలమయాదేవి పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం ప్యాకేజ్డ్ తాగునీటి నాణ్యతపై దేశవ్యాప్త తనిఖీలు ప్రారంభించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం తీర్పు గుంటూరు పోస్టల్ డివిజన్కు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం.. అవార్డుల పంట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా! ఏటవాకిలి సర్పంచ్ అభ్యర్థి సోమనాథ్ రెడ్డి! సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* దక్షిణ అస్సాంలోని డోలూలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి రూ. 2,014 కోట్లు చాగలమర్రి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ఇ.వి.ఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ భూముల రీ సర్వే ద్వారా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

Select Suryaa Now
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

సూర్య,బూర్గంపాడు,బూర్గంపాడు మండలం వేపలగడ్డ గ్రామపంచాయతీలో రూ.20 లక్షల నిర్మాణ వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ప్రారంభించారు.

 అనంతరం బూర్గంపాడు మండలం పోలవరం గ్రామంలో రూ.12 లక్షల నిర్మాణ వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన వేపలగడ్డలో అన్ని సౌకర్యాలతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని అన్నారు .

గత ప్రభుత్వ హయాంలో అమలైన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూనే, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేయూత పింఛన్లు వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నామని వివరించారు.

గతంలో రైతులకు మాత్రమే పరిమితమైన బీమా భద్రతను ఇప్పుడు రాష్ట్రంలోని పేద కుటుంబాలకు, రైతులకు, గీత కార్మికులకు, కులవృత్తులపై ఆధారపడిన వారికి విస్తరించేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. కుటుంబ పెద్దను ప్రమాదవశాత్తు కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా పేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో ఇళ్లను మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.5 లక్షలు జమ చేసి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని వివరించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిరుద్యోగ యువతకు ఇప్పటికే 74 వేల ఉద్యోగాలు కల్పించామని, మరో 14 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాల కింద రూ.75 వేల కోట్లకు పైగా రుణాలు అందించామని, ఇందుకు సంబంధించి సుమారు రూ.3 వేల కోట్లకు పైగా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని పేర్కొన్నారు.

మహిళల గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ గతంలో నాణ్యతలేని చీరలకు బదులుగా మొదటి విడతలో పాలపిట్ట రంగు ఇందిరమ్మ చీరలను అందించామని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు సంబంధించి మిగిలిన హామీలను కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు.

పినపాక నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలన్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతానికి కూడా నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం పోలవరం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు అందించే సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతమైన వేపలగడ్డ గ్రామపంచాయతీలో నూతన భవనాన్ని ప్రారంభించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచ్చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పినపాక నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లతో పాటు అదనంగా మరో 1,000 ఇళ్లను మంజూరు చేయించామని, మొత్తంగా 4,500 పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే అవకాశం కలిగిందని తెలిపారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని పేర్కొన్నారు. వేపలగడ్డ, కొమ్మునగరంపేట ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, కొమ్మునగరంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి, సంబంధిత అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల సంభవించిన ఈదురుగాలుల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, నష్టపోయిన అర్హులైన కుటుంబాలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చి పనులు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరోష, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర గ్రామాల సర్పంచులు, నాయకులు, గ్రామస్థులు,పాల్గొన్నారు.

సూర్య ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ