ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలి
ఖానాపూర్ , మేజర్ న్యూస్, ప్రభుత్వ భూముల వేలం తక్షణమే నిలిపివేసి ప్రజా అవసరాల కోసం పరిరక్షించాలని, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (యునైటెడ్) ఖానాపురం మండల పార్టీ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ రమేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ, మండల కార్యదర్శి కలకోట్ల యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు భవిష్యత్తు తరాల అవసరాల కోసం ఉపయోగపడాలని, వేలం వల్ల పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, క్రీడా మైదానాలకు భూములు లేకుండా పోతాయని అన్నారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఉచితంగా స్థలాలు కేటాయించాలని, పేదల ఇళ్లను ప్రత్యామ్నాయ పునరావాసం లేకుండా తొలగించరాదని, పేదలకు తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రిపోర్టర్ ; అనిల్ కుమార్ ,కానాపురం, వరంగల్ జిల్లా