BREAKING
కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా! జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం ఆకాశంలో ఒక తార సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు.. ఏమన్నారంటే?

ఏపీగుంటలో ఎన్నికల జాతరా.. అధికారుల నిఘా ఏదీ? పట్టపగలే చీరలు, మద్యం, నగదు పంపిణీ ఆరోపణలు.. ఇంటింటికీ కుక్కర్ల పంపిణీకి ఏర్పాట్లు?

Select Suryaa Now
ఏపీగుంటలో ఎన్నికల జాతరా.. అధికారుల నిఘా ఏదీ?  పట్టపగలే చీరలు, మద్యం, నగదు పంపిణీ ఆరోపణలు.. ఇంటింటికీ కుక్కర్ల పంపిణీకి ఏర్పాట్లు?

టి. నరసాపురం, మేజర్ న్యూస్: మండలంలోని ఏపీగుంట పంచాయతీలో ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం కొనసాగుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టపగలే చీరలు, మద్యం, నగదు పంపిణీ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఒక వార్డుకు కుక్కర్ గుర్తు కేటాయించడంతో, పెద్ద సంఖ్యలో కుక్కర్లను సిద్ధం చేసి ప్రతి ఇంటికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.ఇంత బహిరంగంగా ఎన్నికల ప్రలోభాలకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నా ఎన్నికల అధికారులు, నిఘా బృందాలు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇతర పంచాయతీలపై నిఘా పెడుతున్న అధికారులు ఏపీగుంటలో జరుగుతున్నట్లు చెబుతున్న వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీస్తున్నారు.ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, కుక్కర్ల పంపిణీ ఆరోపణలతో పాటు చీరలు, మద్యం, నగదు పంపిణీ అంశాలపై వాస్తవాలు వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 అద్దంకి గిరి కుమార్ క్రైమ్ రిపోర్టర్ పోలవరం,