BREAKING
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం ఆకాశంలో ఒక తార సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు.. ఏమన్నారంటే? ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా

ఉద్యోగాలకు 69 మంది ఎంపిక

Select Suryaa Now
ఉద్యోగాలకు 69 మంది ఎంపిక

నగరం, మేజర్ న్యూస్:
స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో మల్టీనేషనల్ కంపెనీలతో మెగా జాబ్ మేళా బుధవారం నిర్వహించారు.
తీరప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో బాపట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ తెలిపారు.
జాబ్ మేళాలో హెటెరో, జెన్‌పాక్ట్, మెడ్‌ప్లస్ తదితర మొత్తం 17 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు 173 మంది నిరుద్యోగులు పాల్గొనగా, 69 మందిని వివిధ కంపెనీలకు ఎంపిక చేసి, మరో 20 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ సజ్జా శ్రీనివాసరావు, డాక్టర్ ఏ. కోటేశ్వర రావులు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను బుచ్చయ్య చౌదరి అభినందిస్తూ, విద్యార్థుల అభివృద్ధి, ప్లేస్‌మెంట్ అవకాశాల పెంపుకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్న బాబు, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ టి. రాజారావు, ఏపీ ఎస్ ఎస్ డి సి ప్లేస్‌మెంట్ ఆఫీసర్ జి. సురేష్, కార్యాలయ సూపరింటెండెంట్  అమరేష్ రెడ్డి పాల్గొన్నారు.