ఆర్య, వైష్ణవి చైతన్య 'హలో ప్రేమ' తెలుగు ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న రొమాంటిక్ లవ్ స్టోరీ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బేబీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య, కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ హలో ప్రేమ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. నిఖిల విమల్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నిఖిల్ మురళి దర్శకత్వం వహించారు. ప్రేమ, భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒక బస్సు ప్రయాణం నేపథ్యంలో మొదలయ్యే రెండు భిన్నమైన ప్రేమకథల చుట్టూ ఈ సినిమా తిరుగుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఆర్య, వైష్ణవి చైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటూనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించనుండటం విశేషం. తమిళంలో హలో కాదల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో హలో ప్రేమ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు నిఖిల్ మురళి ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
నిర్మాణ విలువల పరంగా రిచ్‌గా కనిపిస్తున్న హలో ప్రేమ చిత్రాన్ని డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విభిన్నమైన ప్రేమకథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.