వారణాసికి రికార్డు స్థాయి ఓటీటీ ఆఫర్.. నెట్‌ఫ్లిక్స్‌తో ఇన్ని వందల కోట్ల డీల్ కుదరనుందా?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసి విడుదలకు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 400 కోట్ల నుంచి 450 కోట్ల రూపాయల మధ్య ఈ ఓటీటీ డీల్ కుదిరే అవకాశం ఉందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ పనుల్లో వేగం పెంచింది. ఈ నెలాఖరులోగా డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ స్థాయిలో ఒప్పందం ఖరారైతే భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఓటీటీ డీల్‌గా వారణాసి నిలవనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విషయంలోనూ సుమారు 290 కోట్ల రూపాయల మేర భారీ వ్యాపారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడు కుంభ పాత్రలో అలరించనున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో సీజీఐ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విడుదల తేదీ విషయంలో ఆగస్టు 2027 విండోపై కూడా చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ భారీ విజువల్ వండర్‌పై అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఓటీటీలోకి మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. స్పార్క్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?